4 నెలలకే అబార్షన్.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా : నమిత ఎమోషనల్

4 నెలలకే అబార్షన్.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా : నమిత ఎమోషనల్

హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్లలలో ఈమె కూడా ఒకరు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. కాగా, అక్కడ తాను ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యింది.

హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్లలలో ఈమె కూడా ఒకరు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. కాగా, అక్కడ తాను ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యింది.

హీరోయిన్ ‘నమిత’.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఒకప్పుడు టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్లలలో ఈమె కూడా ఒకరు. కాగా,ఈమె మొదటగా ఆర్యన్ రాజేశ్ నటించిన సొంతం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఇక తొలి సినిమాతోనే నటిగా తన అద్భుతమైన నటనతో మంచి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమలోనే వరుస ఆఫర్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మంచి ఫేమ్ ను సంపాదించుకుంది. ఇక అప్పటిలో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. కానీ, ఆ తర్వాత కెరీర్ కాస్త డల్ అయ్యింది ఈ అమ్మాడు.

ఈ క్రమంలోనే బొద్దుగా మారడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలో సెకండ్ హీరయిన్ గా, ఐటెం గార్ల్ గా కొన్ని సినిమాల్లో మెరిసిన సంగతి తెలిసింది. అలా నమిత తన కెరీర్ స్లో అయిన సమయంలో 2017లో బిజినెస్‌మెన్‌ వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఈ జంటకు 2022లో కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమిత తన ప్రెగ్నెన్సీ విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి అందరితో పంచుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. టాలీవుడ్ ముద్దుగుమ్మ నమిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. కాగా, అక్కడ తన ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి మాట్లాడుతూ.. నేను మొదటిసారిగా 2021లో గర్భం ధరించాను.  ఇక ఆ సమయంలో నేను సూరత్‌లో ఉన్నాను. నాతో పాటు అమ్మానాన్నలు కూడా ఉన్నారు. ‍​కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు.

ఎందుకంటే.. నాలుగు నెలలకే నాకు గర్భస్రావం అయింది. దీంతో తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అయితే అదృష్టవశాత్తూ ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్‌ అయ్యాను అని అప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్ అయ్యింది నమిత. కాగా, ఇటీవలే తన భర్తతో నమిత విడాకులు తీసుకుంటున్నట్లు వార్తులు వినిపిస్తున్నాయి. ఇక నమిత సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ తెలుగులో జెమిని, నాయకుడు, బిల్లా, సింహ వంటి సినిమాల్లో నటించింది. అలాగే తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ వంటి  భాషల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత. ఇక చివరిగా ఈమె 2020లో మాయ అనే తమిళ సినిమాలో మెరిసింది. మరి, ప్రెగెన్నీ సమయంలో నమితకు ఎదురైన చేదు అనుభవాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments