నాకు ఆ ఛాన్స్‌ వచ్చినా మోదీ బయోపిక్‌లో నటించను : సత్యరాజ్‌

నాకు ఆ ఛాన్స్‌ వచ్చినా మోదీ బయోపిక్‌లో నటించను: సత్యరాజ్‌

గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్‌ లో టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు చాలామంది ప్రముఖల పేర్లు వినిపించాయి. అందులో ముఖ్యంగా బహుబలి నటుడు సత్యరాజ్‌ పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా ఈ విషయం పై నటుడు సత్యరాజ్‌ క్లారిటీ ఇచ్చారు.

గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్‌ లో టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు చాలామంది ప్రముఖల పేర్లు వినిపించాయి. అందులో ముఖ్యంగా బహుబలి నటుడు సత్యరాజ్‌ పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా ఈ విషయం పై నటుడు సత్యరాజ్‌ క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలోని బయోపిక్‌ లు తీయడం ట్రెండ్‌ గా మారింది.  ఈ క్రమంలోనే.. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవితాలపై సినిమాలు చాలానే తీశారు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదారణ లభిస్తుంది. అందుకే ఇండస్ట్రీలో దర్శక, నిర్మాతలు కూడా ఇలాంటి బయోపిక్‌ లు తీయడంపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ​పై బయోపిక్ రూపొందిన సంగతి తెలిసిందే. కాగా, దీనిని ‘పీఎం నరేంద్ర మోడీ’ పేరుతో 2019లో హిందీలో తెరకెక్కించారు. ఇందులో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే​ ఒమంగ్ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు.  ఇక ఈ చిత్రం అప్పటిలో ప్రేక్షకుల్ని బాగా  అలరించింది.  అయితే తాజాగా మళ్లీ మోడీ జీవితం మీద మరో బయోపిక్ తీసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ప్రధాని బయోపిక్‌ లో ఇప్పటికే టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు చాలామంది ప్రముఖల పేర్లు వినిపించాయి. అందులో ముఖ్యంగా బహుబలి నటుడు సత్యరాజ్‌ పేరు కూడా వినిపించింది. ఆయన మోడీ బయోపిక్‌ లో నటిస్తున్నారని రూమర్స్‌ వినిపించాయి. ఇక తాజాగా ఈ విషయం పై నటుడు సత్యరాజ్‌ క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సత్యరాజ్‌ మోడి బయోపిక్‌ పై తాను నటిస్తున్న అని వస్తున్న రూమర్స్‌ పై స్పందించారు. ఈ సందర్భంగా సత్యరాజ్‌ మాట్లాడుతూ.. ‘నేను నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం లేదు. పైగా ఆ ప్రాజక్ట్‌ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. అలాంటప్పుడు నేను మోదీ పాత్రలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది.

కనుక సోషల్ మీడియాలో కూడా  ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. ఇకపోతే భవిష్యత్‌లో మోదీ బయోపిక్‌ కోసం నన్ను ఎవరైనా సంప్రదించినా నేను చేయననే చెప్తాను. ఎందుకంటే.. నేను నా సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే అవాకాశం ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి రూమర్స్‌ వచ్చాయి. ఇంతటితో ఆపేయండి’ అని క్లారిటీ ఇచ్చారు. మరి, మోదీ బయోపిక్‌ లో సత్యరాజ్‌ నటించని స్పష్టం చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments