రజినీకాంత్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు.. ఇన్నేళ్ల తర్వాత క్లారిటీ ఇచ్చిన స్టార్ యాక్టర్!

రజినీకాంత్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు.. ఇన్నేళ్ల తర్వాత క్లారిటీ ఇచ్చిన స్టార్ యాక్టర్!

సూపర్ స్టార్ రజినీకాంత్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రముఖ యాక్టర్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఇన్ని సంవత్సరాలు ఆయన సినిమాల్లో నటించకపోవడానికి కారణం కూడా ఈ సందర్బంగా తెలిపాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ రజినీకాంత్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రముఖ యాక్టర్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఇన్ని సంవత్సరాలు ఆయన సినిమాల్లో నటించకపోవడానికి కారణం కూడా ఈ సందర్బంగా తెలిపాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ రజినీకాంత్.. భారతదేశంతో పాటుగా వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు. తన నటనతో, స్టైల్ తో ప్రేక్షకులను కొన్ని దశాబ్దాలుగా అలరిస్తున్నాడు. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోలేదు, ఇతరులతో  గొడవలు పడ్డ దాఖలాలు కూడా లేవు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఓ ప్రముఖ యాక్టర్ తో రజినీకి విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలపై చాలా ఏళ్ల తర్వాత స్పందించాడు సదరు నటుడు. రజినీతో గొడవల విషయంపై ఏమన్నాడంటే?

సాధారణంగా ఇండస్ట్రీలో ఇద్దరు నటీ, నటుల మధ్య విభేదాలు ఉన్నట్లు ఎన్నో వార్తలు చూశాం. అయితే అందులో కొన్ని నిజాలు ఉన్నా.. బయటకి పొక్కనించేవారు కాదు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు తనకు విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు స్టార్ యాక్టర్ సత్యరాజ్. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశాడు. గతంలో తాను రజినీకాంత్ తో కలిసి నటించకపోవడానికి కారణాలను కూడా తెలియజేశాడు.

సత్యరాజ్ మాట్లాడుతూ..”నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రెండుసార్లు రజినీకాంత్  సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ నాకు ఆ పాత్రలు నచ్చకపోవడంతో ఆ మూవీస్ లో నటించలేదు. అంతే తప్ప మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కొంత మంది కావాలనే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు” అంటూ క్లారిటీ ఇచ్చాడు సత్యరాజ్. 38 ఏళ్ల తర్వాత రజినీతో కలిసి నటిస్తున్నాడు కట్టప్ప. ‘కూలీ’లో కీలక పాత్ర చేస్తున్నాడు సత్యరాజ్. అయితే ఆ పాత్ర ఎలాంటిదో ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. కాగా.. 1986లో కావేరీ జల వివాదం సందర్భంగా రజినీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశాడు సత్యరాజ్. అప్పటి నుంచి వీరిద్దరు కలిసి ఒక్క మూవీలో కూడా కలిసి నటించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నటిస్తున్నారు.

Show comments