Navadeep About Rave Party: వీడియో: రేవ్ పార్టీ అంటే ఏంటో చెప్పిన హీరో నవదీప్..

వీడియో: రేవ్ పార్టీ అంటే ఏంటో చెప్పిన హీరో నవదీప్..

Navadee About Rave Party: ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న అంశం బెంగళూరు రేవ్ పార్టీ కేసు. ఇందులో ప్రముఖ నటి హేమ ఇరుక్కోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా రేవ్ పార్టీ కేసుపై నవదీప్ స్పందించారు.

Navadee About Rave Party: ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న అంశం బెంగళూరు రేవ్ పార్టీ కేసు. ఇందులో ప్రముఖ నటి హేమ ఇరుక్కోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా రేవ్ పార్టీ కేసుపై నవదీప్ స్పందించారు.

టాలీవుడ్ కి సంబంధించి ఏ సంచలనం జరిగినా గానీ అందులో హీరో నవదీప్ ప్రస్తావన అయితే ఖచ్చితంగా ఉంటుంది. డ్రగ్స్ కేసులో ఎవరైనా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు దొరికితే.. నవదీప్ ఉన్నారని వార్తలు వస్తాయి. డ్రగ్స్ కి సంబంధించిన దాంట్లో నవదీప్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది అని ప్రచారం చేస్తారు. తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ కేసుకి సంబంధించి కూడా నవదీప్ హస్తం ఉందని రూమర్స్ వచ్చాయి. రేవ్ పార్టీలో నవదీప్ కూడా పాల్గొన్నారని వార్తలు వచ్చాయి. అయితే వాటిని నవదీప్ ఖండించారు. తనకు, ఆ రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. కాగా రేవ్ పార్టీ అంటే ఏంటి? ఎలా ఉంటుంది? ఎప్పుడైనా రేవ్ పార్టీలకు వెళ్ళారా? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు నవదీప్. లవ్ మౌళి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన బెంగళూరు రేవ్ పార్టీ ఘటనపై స్పందించారు. 

గత కొన్ని రోజులుగా బెంగళూరు రేవ్ పార్టీ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారని.. డ్రగ్స్ కూడా స్వీకరించారని చెబుతున్నారు. రేవ్ పార్టీలో హేమ కూడా పోలీసుల దృష్టిలో పడ్డారు. కాగా తనకు, రేవ్ పార్టీకి సంబంధం లేదని హేమ వరుసగా వీడియోలు చేస్తూ వస్తున్నారు. బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె పార్టీలో పాల్గొందని.. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని వెల్లడించారు. అయినప్పటికీ హేమ మాత్రం అమాయకురాలిలా తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో హేమకు నోటీసులు కూడా పంపారు. విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపినా గానీ హేమ మాత్రం విచారణకు వెళ్ళలేదు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. చివరికి ఏమవుతుందో తెలియదు కానీ ఈ రేవ్ పార్టీ ఉదంతంపై నవదీప్ స్పందించారు.

రేవ్ పార్టీ అంటే రేయి, పగలూ జరిగేదే:

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తాను లేనందుకు చాలా మంది డిజప్పాయింట్ అయినట్టున్నారు కదా అంటూ మీడియాపై సెటైర్ వేశారు. దేశంలో ఏ డ్రగ్స్ కేసు ఫైల్ అయినా అందులో నవదీప్ పేరు ఉంటుందని ఫిక్స్ అయిపోతారే.. కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండదని.. ఈ రేవ్ పార్టీ కేసులో కూడా సంబంధం లేదని వెల్లడించారు. ఇక రేవ్ పార్టీ అనేది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని.. రేయి, పగలూ జరిగేది అంటూ వెల్లడించారు. అయితే తాను ఈ దేశంలో ఎప్పుడూ రేవ్ పార్టీలో పాల్గొనలేదని చెప్పుకొచ్చారు. కాగా నవదీప్ నటించిన లవ్ మౌళి సినిమా జూన్ 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో నవదీప్ పెయింటర్ గా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో నవదీప్ ఎన్నడూ లేని విధంగా బోల్డ్ గా నటించారు.

Show comments