చందు, పవిత్రల మరణాలపై నరేష్ ఏమన్నారంటే?

చందు, పవిత్రల మరణాలపై నరేష్ ఏమన్నారంటే?

Actor Naresh Comments: త్రినయని సీరియల్ లో నటించిన పవిత్ర జయరాం-చంద్రకాంత్ ఐదు రోజుల తేడాతో కన్నుమూశారు. వీరిద్దరూ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. తాజాగా వీరి మరణంపై సీనియర్ నటుడు నరేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actor Naresh Comments: త్రినయని సీరియల్ లో నటించిన పవిత్ర జయరాం-చంద్రకాంత్ ఐదు రోజుల తేడాతో కన్నుమూశారు. వీరిద్దరూ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. తాజాగా వీరి మరణంపై సీనియర్ నటుడు నరేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. ఈ నెల బుల్లితెర ఇండస్ట్రీలో వెంట వెంటనే విషాదాలు నెలకొన్నాయి. త్రినయని, కార్తీక దీపం 2 సీరియల్ లో నటించిన పవిత్ర, చంద్రకాంత్ అలియాస్ చందు ఇద్దరూ ఐదు రోజుల తేడాతో చనిపోవడం అటు ఇండస్ట్రీ ఇటు అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది. వీరిద్దరూ గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.. త్వరలో పెళ్లి చేసుకుందాం అని నిర్ణయం తీసుకున్న తర్వాత దారుణం జరిగిపోయింది. తాజాగా వీరిద్దరి మరణాలపై ప్రముఖ నటుడు నరేష్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..

త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఐదు రోజుల తర్వాత సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. గత కొంత కాలంగా ఈ జంట సహజీవనం చేస్తుంది. వీరిద్దరి మరణం బుల్లితెర ఇండస్ట్రీకి తీరని లోటు అంటు సెలబ్రెటీలు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా చందు-పవిత్ర మరణంపై స్టార్ నటుడు నరేష్ మాట్లాడారు. ‘మనకు సర్వస్వం అనుకునే వారు హఠాత్తుగా మనకు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటూందో ఊహించుకోవడం చాలా కష్టం. ఆ సమయానికి మనల్ని ఓదార్చడానికి పక్కనే ఎవరైనా ఉండాలి.. లేదంటే డిప్రేషన్ లోకి వెళ్తారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.. ఆ సమయంలో ఒకరిని ఒకరు కష్టమొస్తే ఓదార్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఎవరి లోకం వారిది. మా అమ్మ విజయనిర్మలమ్మ చనిపోయినపుడు నేను, కృష్ణ గారు ఎంతో బాధపడ్డాం. ఆ సమయంలో ఆయన నన్ను ఓదార్చేవారు.. నేను ఆయన్ని ఓదార్చేవాన్ని. అలా అమ్మ పోయిన బాధ నుంచి కొంతకాలానికి మేం బయటికి వచ్చాం’ అని అన్నారు.

‘ఎవరైనా ఇష్టమైన వాళ్లు మన కళ్ల ఎదుటే చనిపోతే చాలా కాలం వారి జ్ఞాపకాలు మన వెంట ఉంటాయి. అది కొంతమంది జీర్ణించుకోలేక తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు వారికి అండగా ఉండాలి. ఇప్పటి బిజీ లైఫ్ లో పక్కవారి గురించి పట్టించుకోవం చాలా వరకు మర్చిపోయారు.. ఆ పరిస్థితి మారాలి. నటి పవిత్ర మరణం దగ్గర నుంచి చూసిన చంద్రకాంత్ తీవ్ర మనస్థాపానికి గురై ఒంటరిగా బాధపడ్డారు. ఆ బాధే అతన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది’ అని అన్నారు నటుడు నరేష్. తాజాగా నరేష్ అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments