కమల్ హాసన్ మూవీ షూటింగ్ లో ప్రమాదం! స్టార్ యాక్టర్..

కమల్ హాసన్ మూవీ షూటింగ్ లో ప్రమాదం! స్టార్ యాక్టర్..

కమల్ హాసన్ నటిస్తున్న 'థగ్ లైఫ్' మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో స్టార్ యాక్టర్ కు గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

కమల్ హాసన్ నటిస్తున్న 'థగ్ లైఫ్' మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో స్టార్ యాక్టర్ కు గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక సినిమా షూటింగ్ జరుపుకుని విడుదల అవ్వడం అంటే ఆషామాషీ విషయం కాదు. మూవీ ప్రారంభం నుంచి మెుదలు.. రిలీజ్ అయ్యే వరకు ఎన్నో కష్టనష్టాలను దాటుకుని రావాల్సి ఉంటుంది. ఇక షూటింగ్ జరిగేటప్పుడు అప్పుడప్పుడు ఊహించని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’ మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో స్టార్ యాక్టర్ కు గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఈ మూవీలో భారీ తారాగాణం ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు, మాలీవుడ్ ప్రముఖ యాక్టర్ జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, త్రిష, జయం రవి, దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్ ఇలా స్టార్ కాస్టింగ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పాండిచ్చేరి ఎయిర్ పోర్ట్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో హెలికాప్టర్ జంపింగ్ సీన్స్ తీస్తుండగా.. స్టార్ యాక్టర్ జోజు జార్జ్ ఎడమకాలికి గాయమైంది. దాంతో వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయమే అవ్వడంతో.. అతడి కాలికి పట్టీ వేశారు. స్టిక్ సాయంతో జోజు జార్జ్ నడుస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో గాయం నుంచి తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక మేకర్స్ థగ్ లైఫ్ టీమ్ తో డిజైన్ చేసిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

Show comments