గన్‌తో కాల్పులు జరిపి వ్యక్తి హత్య.. తెలుగు విలన్ అరెస్ట్!

గన్‌తో కాల్పులు జరిపి వ్యక్తి హత్య.. తెలుగు విలన్ అరెస్ట్!

ఈ మద్య కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ మద్య కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఎదుటి వారిపై దాడులు చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గతంలో కొంతమంది నటీనటులు అభిమానులు దగ్గరికి వస్తే వారిపై దురుసుగా ప్రవర్తించడం, చేయి చేసుకోవడం లాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాము సెలబ్రెటీలం.. ఏదైనా చేస్తాం అనే కొంతమందికి పోలీసులు చెక్ పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా ఓ నటుడు విచక్షణ కోల్పోయి లైసెన్స్ గన్ తో పలువురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఓ యువకుడు కన్నుమూయడంతో అక్కడ అంతా విషాదం నెలకొంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ టీవీ నటుడు భూపిందర్‌ సింగ్‌ హత్యానేరంపై అరెస్టయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్నోర్‌లో నివసిస్తున్న యువకుడుపై తన గన్ తో భూపేంద్ర కాల్చి చంపిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక చెట్టును నరికివేసే వివాదంలో భూపిందర్‌ సింగ్‌ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు నటుడు భూపేంద్ర సింగ్‌తో పాటు అతనితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. హత్యకు గురైన యువకుడి మామ భూపిందర్‌ తో పాటు మరో నలుగురి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం భూపిందర్‌ సింగ్‌ భార్య జైపూర్ లో నివసిస్తుంది. వీరి సంతానం విదేశాల్లో చదువుకుంటున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని కౌన్‌కేదా ఖాద్రీ గ్రామంలో భూపిందర్‌ కి ఒక ఫామ్ హౌజ్ ఉంది. ఒక్కడ ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది నివసిస్తున్నారు. భూపిందర్‌ సింగ్‌ ఇంటి పక్కనే గుర్దీప్ సింగ్ కుటుంబం నివసిస్తుంది. కొంత కాలంగా విరిద్దరి సరిహద్దులో ఒక చెట్టు గురించి వివాదం నడుస్తుంది. ఇటీవల భూపిందర్ తన ఫామ్ హౌజ్ కి వచ్చారు. ఈ క్రమంలోనే చెట్ల విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. తాను నటుడిని అనే గౌరవం లేకుండా తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా అంటూ భూపిందర్‌ సింగ్‌ ఆవేశంతో ఊగిపోయాడు. తన వద్ద ఉన్న గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు..ఈ ఘటనలో గుర్దీప్ అతని భార్య మీరాబాయి, కుమారుడు బుటా సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. మరో కుమారుడు గోబింద్ సింగ్ అక్కడిక్కడే మరణించాడు. గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. గ్రామస్థులు  పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో భూపిందర్‌ సింగ్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.

భూపేందర్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. జై మహాభారత్‌ సీరియల్‌తో తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించాడు. తెలుగు లో తమ్ముడు, అన్నయ్య, భలేవాడివిబాసు, విలన్, అంజి, శంకర్ దాదా ఎంబీబీఎస్, దేవి పుత్రుడు లాంటి చిత్రాల్లో ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించాడు. 2010 లో సోచ్ మూవీ అతడి ఆఖరి చిత్రం అంటున్నారు. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న భూపేందర్ సింగ్ వ్యాపారాలు చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. చిన్న వివాదానికే వ్యక్తి ప్రాణాలు తీసిన నటుడిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments