అర్జున్ కూతురు పెళ్లి వీడియో వైరల్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన కింగ్

అర్జున్ కూతురు పెళ్లి వీడియో వైరల్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన కింగ్

Arjun Sarja : ఇటీవలే హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య, ఉమాపతి వివాహం చెన్నైలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యారేజ్ వేడుకలకు సంబంధించి ఓ వీడియో గ్లింప్స్ ను తాజాగా అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేరు చేశాడు. ఇకపోతే ఈ వీడియోకు అర్జున్ ఓ ఎమోషనల్ నోట్  రాసుకొచ్చాడు.

Arjun Sarja : ఇటీవలే హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య, ఉమాపతి వివాహం చెన్నైలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యారేజ్ వేడుకలకు సంబంధించి ఓ వీడియో గ్లింప్స్ ను తాజాగా అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేరు చేశాడు. ఇకపోతే ఈ వీడియోకు అర్జున్ ఓ ఎమోషనల్ నోట్  రాసుకొచ్చాడు.

సౌత్ ఇండియా స్టార్ నటుడు, యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న హీరో ‘అర్జున్ సర్జా’ ప్రేక్షకులు అందరికి సుపరిచితమే. కాగా,ఈ హీరో ఇంట తాజాగా పెళ్లి బాజాలు మోగాయి.అయితే అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ఉమాపతి రామయ్యల వివాహం జూన్ 10వ తేదీన చైన్నైలోని గెరుగంబాక్కంలోని హనుమాన్ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వేడుకలకు పలువురు హాజరయ్యారు. అలాగే టాలీవుడ్ నుంచి కన్నడ పరిశ్రమ వరకు పలువురు సెలబ్రిటీస్ ఈ జంటకు సోషల్ మీడియా వేదిక విషెస్ ను తెలిపారు. ఇదిలా ఉంటే.. తాజాగా హరో అర్జును తన కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ఉమాపతి రామయ్యల వివాహానికి శుభాకాంక్షలు తెలిపుతూ.. ఆ పెళ్లి వీడియోను ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్య వెడ్డింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా, ఆ వీడియోకు ఓ ఎమోషనల్ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య, ఉమాపతి వివాహం చెన్నైలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యారేజ్ వేడుకలకు సంబంధించి ఓ వీడియో గ్లింప్స్ ను తాజాగా అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేరు చేశాడు. ఇక ఆ వీడియోలో అల్లుడు ఉమాపతి, ఐశ్వర్య సాంప్రాదాయబద్ధంగా కనిపించారు. ఇక అర్జున్ అల్లుడుని గొడుగు పట్టి తీసుకురావడం, అనంతరం పెళ్లి పీటలపై ఐశ్వర్య, ఉమాపతి సందడి కన్నులవిందుగా జరిగింది. ముఖ్యంగా ఈ వీడియోలో అల్లుడికి అర్జున్ ముద్దుపెట్టడం హైలెట్ గా నిలిచింది. ఇకపోతే ఈ వీడియోకు అర్జున్ ఓ ఎమోషనల్ నోట్  రాసుకొచ్చాడు.

కాగా, అందులో ‘మా ముద్దుల కూతురు ఐశ్వర్య తన జీవితంలో ప్రేయమైన ఉమాపతిని వివాహం చేసుకున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. ఇక ఆ సంతోషాన్ని మాటాల్లో చెప్పలేము. అసలు ఆ క్షణం మాకు ఒక ప్రియమైన మరపురాని జ్ఞాపకాలతో నిండిన రోజు. ఇక ఈ కొత్త జీవిత బంధంలోకి నువ్వు అడుగుపెట్టడంతో మా హృదయం ఉప్పెంగిపోతుంది. ఇక మీరు జీవితాంతం ఇలానే ప్రేమను పంచుకుంటూ.. సంతోషంగా ఉండాలి, అలాగే వేలకోట్ల ఆశీర్వాదాలు పొందాలని’ అర్జున్ సర్జార్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Show comments