Acer ALG Gaming Laptop Price And Specifications: ఇది మామూలు కాంబినేషన్ కాదు.. అదిరిపోయే గేమింగ్ ల్యాప్ ట్యాప్ తెచ్చిన ACER!

ఇది మామూలు కాంబినేషన్ కాదు.. అదిరిపోయే గేమింగ్ ల్యాప్ ట్యాప్ తెచ్చిన ACER!

Acer Newly Launched It's ALG Gaming Laptop Price And Specifications: ఏసర్ కంపెనీ బడ్జెట్ రేంజ్ లోనే అదిరిపోయే ల్యాప్ ట్యాప్స్ తీసుకొస్తుంది. తాజాగా ఒక సూపర్ గేమింగ్ ల్యాప్ ట్యాప్ ని బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది.

Acer Newly Launched It's ALG Gaming Laptop Price And Specifications: ఏసర్ కంపెనీ బడ్జెట్ రేంజ్ లోనే అదిరిపోయే ల్యాప్ ట్యాప్స్ తీసుకొస్తుంది. తాజాగా ఒక సూపర్ గేమింగ్ ల్యాప్ ట్యాప్ ని బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది.

Acer గేమింగ్ లాప్టాప్స్ ని లాంఛ్ చెయ్యడంలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న బ్రాండ్. గతంలో కూడా నైట్రో సిరీస్ ని గేమింగ్ వరల్డ్ కి పరిచయం చేశారు. అంత తక్కువ ప్రైస్ లో గేమింగ్ లాప్టాప్ అంటే అది దాదాపు అసాధ్యం అనుకున్నారు అందరూ. అయినా acer దాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఇప్పుడు Acer ఇండియన్ మార్కెట్లో తన తాజా గేమింగ్ ల్యాప్టాప్, Acer ALGని తెసుకుని వచ్చింది. ఇది శక్తివంతమైన నిర్దేశాలు అలాగే స్టైలిష్ డిజైన్ తో గేమింగ్ ప్రేక్షకుల కోసం తయారు చెయ్యబడింది. ఈ ల్యాప్టాప్ 12th జెన్ ఇన్టెల్ కోర్ i5 ప్రాసెసర్ తో ఉంటుంది. ఇది గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం బాగా పనిచేస్తుంది.

Acer ALG గేమింగ్ ల్యాప్టాప్ అధ్బుతమైన హార్డ్‌వేర్ తో బిల్డ్ చేశారు. దీనిలో 16GB వరకు DDR4 RAM, Nvidia GeForce RTX 3050 GPU, 6GB DDR6 వీడియో మెమరీతో అవైలబుల్ గా ఉంది. స్టోరేజ్ 512GB వరకు NVMe SSD ఉన్నాయి. అలాగే డ్యుయల్ M.2 స్లాట్ ద్వారా 2TB వరకు ఎక్స్పాండ్ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంది.ఈ లాప్టాప్ 15.6 ఇంచెస్ పూర్తి-HD (1920×1080 పిక్సెల్స్) IPS డిస్ప్లే ని కలిగి ఉంది. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్ ని అందిస్తుంది. ఇది స్మూత్ గా రన్ చేసే గ్రాఫిక్స్ కోసం వీలుగా ఉంటుంది. ఫుల్ కీబోర్డ్ తో కుడా ఉంటుంది. మొత్తం గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ని మార్చేసేలా ఉంటుంది.

ఈ ల్యాప్ ట్యాప్ ని 4-సెల్ 54Whr లి-యోన్ బ్యాటరీ పవర్ తో పనిచేస్తుంది. ఇది 120W ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. తరచుగా రీఛార్జ్ లేకుండా ఎక్కువ సమయం గేమ్స్ ని ఆడుకునేలా డిజైన్ చేశారు. ఈ ల్యాప్టాప్ 1-మెగాపిక్సెల్ వెబ్‌క్యామ్ అలాగే ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్ తో కూడా ఉంటుంది. వీడియో కాల్స్, స్ట్రీమింగ్ కి వీలుగా ఉంటుంది. అలాగే ఈ ల్యాప్ ట్యాప్ రూ.56,990 నుండి మార్కెట్ లో స్టార్ట్ అవుతుంది. ACER ALG గేమింగ్ ల్యాప్టాప్ ఒకే స్టీల్ గ్రే రంగులో అందుబాటులో ఉంది. మీరు ఆర్డర్ చెయ్యాలనుకుంటే Acer అఫీషియల్ ఇ-స్టోర్ లేదా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే Acer ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ఇంకా ఇతర రిటైల్ అవుట్‌ లెట్స్ లో కూడా అందుబాటులో ఉంది.

Show comments