చరిత్ర సృష్టించిన తెలంగాణ యువరైతు.. జాతీయ స్థాయిలో అరుదైన ఘనత.

చరిత్ర సృష్టించిన తెలంగాణ యువరైతు.. జాతీయ స్థాయిలో అరుదైన ఘనత.

దేశంలోని తాజాగా ఓ యువ రైతు ప్రకృతి వ్యవసాయం చేసి అద్భుతాలను సృష్టించి పది మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇక ఈయన సృష్టించిన విజయాల కారణంగా జాతీయ స్థాయిలో పురస్కారాన్ని అందుకున్నాడు. ఇంతకి ఆయన ఎవరంటే..

దేశంలోని తాజాగా ఓ యువ రైతు ప్రకృతి వ్యవసాయం చేసి అద్భుతాలను సృష్టించి పది మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇక ఈయన సృష్టించిన విజయాల కారణంగా జాతీయ స్థాయిలో పురస్కారాన్ని అందుకున్నాడు. ఇంతకి ఆయన ఎవరంటే..

దేశంలో వ్యవసాయ రంగంకు ఉన్న ప్రత్యేేకత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే.. ఈ వ్యవసాయం రంగం అనేది చాలా కీలకమైనది. ముఖ్యంగా ఏ వృత్తిలో అయిన కష్టనికి తగిన ప్రతిఫలం ఎప్పుడు ఉంటుంది. కానీ, ఈ వ్యవసాయ రంగంలో మాత్రం కష్టనికి ప్రతిఫలం ఎదురు చూపు. ఇక్కడ పంట దిగుబడి బాగుంటేనే ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడి, లాభాలను పొందుతారు.  కనుక దేశంలోని వ్యవసాయం రంగం ఎంత గొప్పదో.. ఆ వ్యవసాయన్నిపండించే రైతు కూడా అంతే గొప్పవాడు. అందుకే దేశానికి రైతు వెన్నుముక్క అని అంటారు. మరి నిరంతరం శ్రమించే ఈ అన్నదాతాలకు ఏటా వ్యవసాయంలో ఆటు పోటులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే.. ఆ ఆటు పోటులను అధిగమించి కొందరు ఈ వ్యవసాయ రంగంలో కొనసాగుతుంటే.. మరి కొందరు మాత్రం పూర్తిగా ఆ రంగాన్ని వదిలేస్తున్నారు.

అయితే తాజాగా ఓ యువ రైతు మాత్రం ఈ వ్యవసాయ రంగంలో ఎన్ని కష్టలు వచ్చిన, ఎంత నష్టం వచ్చిన వారింతి ఇదే రంగంలో కొనసాగి అద్భుతాలను సృష్టించాడు. కాగా, నేటి తరానికి వ్యవసాయ రంగం దేనిలోనూ తక్కువ కాదని నిరిపిస్తూ.. ఆదర్శంగా నిలిచాడు. ఇంతకి ఆయన ఎవరు. ఆయన సృష్టించిన అద్భుతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఓ యువ రైతు శ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అలాగే ఆ కార్యక్రమంలో అతడు పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. మరి ఆయన ఎవరో కాదు.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సారంగుల రవి. జిల్లాలోని తలమడుగు మండలం లచ్చంపూర్ గ్రామానికి చెందిన సారంగుల రవి.. డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇక తన తమ్ముడితో కలిసి తనకు ఉన్న ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. అయితే గత మూడు సంవత్సరాల నుంచి రవి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మొదట రెండు ఎకరాల పొలంలో ఈ పద్దతిలో సాగును ప్రారంభించిన రవి పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా.. వీరు అసలు ఏం పండిస్తున్నారు అని ఇరుగు పొరుగు హెళన చేసేవారు. కానీ, ఆ మాటలను లెక్క చేయకుండా.. ఎలాగైనా ఈ పద్దతిలోనే వ్యవసాయం సాగు చేయాలని ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. అయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అలానే ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. రుధాన్యాలు, కందులు, వేరుశనగ, మిరప, కూరగాయల పంటలను పాలెకర్ పద్దతిన సాగు చేసి మంచి దిగుబడులను సాధించాడు. ఇక తాను సాధించిన ఉత్పత్తులను ఆదిలాబాద్ లోని ఆర్గానిక్ స్టోర్ కు తీసుకువచ్చి విక్రయించి మంచి ఆదాయం పొందుతున్నాడు. అయితే ఇలా తాను చేపట్టిన ప్రకృతి వ్యవసాయంలో అవసరమైన కంపోస్టు ఎరువులను తానే స్వయంగా తయారు చేసుకొని పంటలకు వినియోగించేవారట.

ముఖ్యంగా పొలంలో లభించే వ్యర్ధాలతో కంపోస్టును తయారు చేసుకోవడమే కాకుండా తనకు ఉన్న మూడు దేశవాళి ఆవుల మూత్రం, పేడ తో పంచగవ్య, తదితర సేంద్రీయ ఎరువులను తయారు చేసుకొని పంటలకు ఉపయోగిస్తున్నారట. అయితే గతంలో తన త్మముడు సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి గుంటూరులో శిక్షణ పొందాడని, అలాగే కొన్ని పుస్తకాలను కూడా చదివి ఆ పరిజ్ఞానంతో ఈ ప్రకృతి వ్యవసాయాన్నికొనసాగిస్తున్నట్లు యువ రైతు సారంగుల రవి చెప్పుకొచ్చారు. ఇక యవ రైతుగా సాథించిన విజయానికి ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కూడా గుర్తించింది. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో తనని ప్రకృతి వ్యవసాయదారులకు ప్రతిష్టాత్మకంగా అందజేసే ఐఏఆర్ ఐ ఇన్నోవేటివ్ ఫార్మర్ పురస్కారాన్ని అందజేశారని, కాగా, ఈ పురస్కారాన్ని ఐఆర్ ఐ డైరెక్టర్ ఏ.కే. సింగ్ చేతుల మీదుగా రవి అందుకున్నారని చెప్పుకొచ్చారు. మరి, ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్న ఈ యువ రైతు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments