రోడ్డుపై బైఠాయించి బోరున ఏడుస్తూ.. ఈ తల్లి కష్టం ఎవ్వరికీ రాకూడదు!

రోడ్డుపై బైఠాయించి బోరున ఏడుస్తూ.. ఈ తల్లి కష్టం ఎవ్వరికీ రాకూడదు!

తెలంగాణలో ఫ్రీ బస్సు అమలు పథకం సక్సెస్ అయ్యింది. ఇది కొంత మందికి వరంలా మారితే.. మరికొంత మందికి శాపంలా మారింది. ఇప్పుడు ఓ తల్లి తన ఆవేదనను వ్యక్తం చేసింది.

తెలంగాణలో ఫ్రీ బస్సు అమలు పథకం సక్సెస్ అయ్యింది. ఇది కొంత మందికి వరంలా మారితే.. మరికొంత మందికి శాపంలా మారింది. ఇప్పుడు ఓ తల్లి తన ఆవేదనను వ్యక్తం చేసింది.

ఉద్యోగాలకు, బయట పనులకు వెళ్లాలంటే సామాన్యులు వినియోగించే వాహనం బస్సు. నగరంలో, పట్టణాల్లో బస్సుల్లోనే ఎక్కువ రాకపోకలు సాగిపోతుంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లాలన్నా, రైలు మార్గాలు లేని ప్రాంతాలకు చేరుకోవాలన్న ఉన్న ఒకే ఒక్క రవాణా సౌకర్యం బస్సు మాత్రమే. తక్కువ ఖర్చుతో.. సుఖవంతంగా ప్రయాణం చేయొచ్చు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సులు అందించిన సంగతి విదితమే. మహిళలు, కాలేజీ విద్యార్థినులు, యువతులు, ట్రాన్స్ జెండర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సర్వీసును అందిస్తోంది. దీంతో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రద్దీ నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచింది.

అయితే ఈ ఫ్రీ పథకం కొంత మందికి  వరంలా మారితే.. మరికొంత మందికి శాపంలా మారిపోయింది. రద్దీ కారణంగా కొన్ని సార్లు.. ప్రయాణీకులను ఎక్కించుకోకుండా వెళ్లిపోతున్నారు ఆర్టీసీ డ్రైవర్ అండ్ కండక్టర్.  తాజాగా ఓ మహిళ వికలాంగుడైన బిడ్డతో బస్సు ఎక్కేందుకు బస్టాఫ్ లో నిలబడగా.. ఆగకుండా ముందుకు సాగిపోయింది. వెంటనే బిడ్డను అక్కడే విడిచి.. బస్సు ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేసింది. బస్సు ఎందుకు ఆపడం లేదని, తన బిడ్డ వికలాంగుడని తెలిసి ఎక్కించుకోవడం లేదని బస్సు ముందు నిలబడి కన్నీరు మున్నీరు అవుతుంది. రోడ్డుపై పడుకుని తాను ఇక్కడ నుండి కదిలేది లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఆ వీడియోలో తల్లి తన ఆవేదన ఇలా ఉంది. ‘నేను ఈ బస్సును కావాలని ఆపలేదు. నా కొడుకు పరిస్థితి, నా పరిస్థితి ఇక్కడ వరకు తీసుకు వచ్చింది. అతడిని బస్టాఫ్ లో పడుకొ బెట్టి వచ్చా. ప్రభుత్వమే న్యాయం చేయాలి. నా బిడ్డ వికలాంగుడు. అలా ఉన్నాడని ఎవ్వరు బస్సు ఎక్కించుకోవడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను రోడ్డు మీద పడుకుంటా’ అంటూ అక్కడే బైఠాయించింది. ‘బస్సు నా మీద నుండి పోనీయండి. నా బాధ ఆలోచించండి. ఓ ముసలావిడతో పాటు నా బిడ్డను ఫించను తీసుకునేందుకు వెళుతున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది. అంతలో స్థానికులు రోడ్డుపై కూర్చున్న ఆమెను  పైకి లేపారు. డ్రైవర్ వచ్చి ఆమెతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఘటన సద్దుమణిగింది. మరీ ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏం స్పందిస్తారో వేచి చూడాలి.

Show comments