భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఇంత దారుణం ఎందుకంటే..?

భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఇంత దారుణం ఎందుకంటే..?

భార్యకు భర్త తర్వాతే ఎవరైనా, ఏదైనా. కోట్లు ముందు పెట్టి.. భర్తను పక్కన పెట్టి.. ఎవరు కావాలో అని అడిగితే.. పతినే కోరుకుంటుంది సతి. ఇది ఒకప్పటి మాట. నేడు.. పరిస్థితులు మారిపోయాయి.

భార్యకు భర్త తర్వాతే ఎవరైనా, ఏదైనా. కోట్లు ముందు పెట్టి.. భర్తను పక్కన పెట్టి.. ఎవరు కావాలో అని అడిగితే.. పతినే కోరుకుంటుంది సతి. ఇది ఒకప్పటి మాట. నేడు.. పరిస్థితులు మారిపోయాయి.

‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువైతానని అంది మనీ మనీ.. అమ్మ చుట్టము కాదు.. అయ్య చుట్టుము కాదు ఐనా.. అన్ని అంది మనీ మనీ’ డబ్బు ప్రాధాన్యత గురించి ఓ సినీ కవి ఎప్పుడో చెప్పాడు. ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ఏ చిన్న పని జరగాలన్న నేడు డబ్బుతోనే ముడిపడిపోయి ఉండటంతో స్వార్థ పూరితంగా మారుతున్నారు. పైసా మే పరమాత్మ అన్నారని, రియల్ లైఫ్ దేవుళ్లైన తల్లిదండ్రుల ఆస్తిపై కన్నేసి, చిత్ర హింసలకు గురి చేస్తున్నారు కొడుకులు, కూతుళ్లు. ఇప్పుడు పిల్లలు, పేరెంట్స్ కాదు.. భార్య భర్తల మధ్య కూడా తగువుకు కారణమౌతుంది ఈ డబ్బు. అందుకే డబ్బు భలే జబ్బు అన్నారు.

భర్త అంటే పతి దేవుడిగా భావిస్తుంది ఇల్లాలు. కానీ ఈ బంధాన్ని కూడా బలహీనం చేసేసింది దుడ్డు. తాజాగా తాళి కట్టిన మగడును ఆస్తి కోసం గొలుసులతో కట్టేసిందో మహా ఇల్లాలు.. ఈ ఘటన తెలంగాణలోన మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..అంబేద్కర్ నగర్‌లో భార్యాభర్తలు పత్తి కృష్ణ(50), భారతి (45) నివాసం ఉంటున్నారు. అయితే వీరిద్దరికీ కొన్ని సంవత్సరాల నుండి ఫ్లాట్ల విషయంలో గొడవ జరుగుతుంది. ఆస్తి తనకు రాసిచ్చేయాలని పోరు పెడుతోంది. దీనిపై తగాదాలు పీక్స్‌కు చేరాయి. భార్య పోరు పడలేని భర్త కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలేసి వెళ్లిపోయాడు. భర్త వెళ్లిపోయిన తర్వాత అతడి ఆచూకీ కోసం గాలించింది భార్య భారతి.

ఎట్టకేలకు అతడు ఎక్కడ ఉన్నాడో పసిగట్టి.. ఇంటికి తీసుకు వచ్చింది. ఇంటికి తీసుకు వచ్చాక.. మళ్లీ పారిపోకూడదన్న ఉద్దేశంతో గొలుసులతో కట్టేసింది. భర్త వద్దని చెప్పినప్పటికీ వినిపంచుకోలేదు. ఆస్తి మొత్తం తనకు ఇచ్చేయాలని కొడుతూనే ఉంది. ఈ బాధను తట్టుకోలేక అతడు కేకలు పెడుతుంటే.. నోరు నొక్కేసేది. అయితే ఇరుగు పొరుగుకు ఈ విషయం తెలిసి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు.. అతడ్ని నిర్బంధించిన ప్రాంతానికి చేరుకుని.. భార్య చెర నుండి విముక్తి కల్పించారు. దీంతో పోలీసుల ముందు ఘోల్లుమన్నాడు కృష్ణ. మూడు రోజుల నుండి తనను కొడుతూ హింసకు గురి చేస్తుందని ఏడ్చేశాడు భర్త. పోలీసులు భార్య భారతికి వార్నింగ్ ఇచ్చారు.  ఆమెకు కాస్త  కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారు. మొత్తానికి ఆస్తి విషయంలో తాళి కట్టిన భర్తనే నిర్భందించింది ఈ భార్యామణి. ఈ వార్త నెట్టింట్లో వైరల్ కూడా అవుతుంది. పెళ్లి చేసుకోవడం కంటే.. చేసుకోకపోవడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు బ్యాచులర్స్.

Show comments