Yougn Woman With Cigarette: వీడియో: గుడిలో మోడ్రన్ దుస్తుల్లో యువతి.. దీపంతో సిగరెట్ వెలిగించి..

వీడియో: గుడిలో మోడ్రన్ దుస్తుల్లో యువతి.. దీపంతో సిగరెట్ వెలిగించి..

Yougn Woman With Cigarette: గుడిలో మోడ్రన్ దుస్తుల్లో వెళ్తేనే అపచారం అని అంటారు. అలాంటిది ఏ యువతి ఏకంగా గుడిలో దీపంతో సిగరెట్ వెలిగించి మరీ హడావుడి చేసింది. మరి కర్మ వదిలిపెడుతుందా? ఏం జరిగిందో చూడండి. 

Yougn Woman With Cigarette: గుడిలో మోడ్రన్ దుస్తుల్లో వెళ్తేనే అపచారం అని అంటారు. అలాంటిది ఏ యువతి ఏకంగా గుడిలో దీపంతో సిగరెట్ వెలిగించి మరీ హడావుడి చేసింది. మరి కర్మ వదిలిపెడుతుందా? ఏం జరిగిందో చూడండి. 

దేవుడ్ని నమ్మేవాళ్ళు ఉంటారు. నమ్మనివాళ్ళు ఉంటారు. ఎవరి ఇష్టాలు వారివి. ఎవరి  జీవితం వారిది. ఎవరి నమ్మకాలు వారివి. అయితే ఇక్కడ ఎవరి నమ్మకాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ఎవరినీ బలవంతపెట్టే అధికారమూ లేదు. దేవుడంటే నమ్మకం లేకపోతే నమ్మడం మానేయాలి. అంతేగానీ దూషించకూడదు. కానీ ఇటీవల కాలంలో దేవుడ్ని నమ్మేవాళ్ళని మూర్ఖులుగా చూడడం.. దేవుడ్ని దూషించడం వంటివి చేస్తున్నారు. పాపులర్ అవ్వడం కోసం దేవుడ్ని తిట్టడం ఇప్పుడొక ట్రెండ్. ఈ యువతి కూడా అదే ట్రెండ్ లో కొట్టుకుపోవడానికి వచ్చింది. కర్మ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి దాదాపు గిలగిల కొట్టుకుపోయేంత పరిస్థితి వచ్చింది. 

బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఒక యువతి గుడిలోకి ప్రవేశించింది. ఆమె తల్లి కూడా వచ్చారు. ఆమె ప్రదక్షిణలు చేస్తున్నారు. గర్భగుడిలో పూజారి మంగళహారతి ఇస్తున్నారు. ఇతర భక్తులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆ యువతి మంగళహారతి ఇచ్చే దీపంతో సిగరెట్ వెలిగించింది. ఫోన్ లో మాట్లాడుతూ.. అటూ ఇటూ తిరుగుతూ ఒక పక్కకు వెళ్లి సిగరెట్ నోట్లో పెట్టుకుని కాసేపు హంగామా చేసింది. ఆ తర్వాత ఆమె తల్లి ఆమె వద్దకు వెళ్లి మందలించి సిగరెట్ లాక్కుని కింద పడేశారు. ఆ యువతి కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతుండగా కింద పడింది. యువతి తల్లి సహాయం కోసం అరుస్తున్నారు. ఆమె బోన్ బ్రేక్ అయినట్లు తెలుస్తోంది. కింద పడడంతో నడుముకి దెబ్బ తగిలినట్లు ఆ యువతి బాధపడుతోంది.

ఇదంతా గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోలో ఆ యువతి చేసిన పనిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిలో ఇలాంటి పనులేంటి అంటూ మండిపడుతున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ప్రాంక్ వీడియో లాంటిదని.. కావాలని షూట్ చేసినటున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వీడియో కోసం చేసినా లేక మామూలుగా చేసినా గానీ యువతిది తప్పే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి గుడిలో సిగరెట్ తో హల్చల్ చేసిన యువతిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments