Rare Operation: బాలికకు కుడివైపున గుండె.. వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి..!

బాలికకు కుడివైపున గుండె.. వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి..!

Rare Operation: ప్రపంచంలో ఇప్పుడు వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. డాక్టర్లు చేయలేని వైద్యం అంటూ లేదు.. చనిపోయిన మనిషిని బతికించడం తప్ప. తాజాగా గుంటూరు వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు.

Rare Operation: ప్రపంచంలో ఇప్పుడు వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. డాక్టర్లు చేయలేని వైద్యం అంటూ లేదు.. చనిపోయిన మనిషిని బతికించడం తప్ప. తాజాగా గుంటూరు వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు.

టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించాడు మానవుడు. ముఖ్యంగా వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. చనిపోయిన మనిషి ప్రాణాలు తిరిగి తీసుకు రావడం తప్ప అన్నీ రకాల వైద్యాలు చేస్తున్నాడు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే.. ఆపద సమయంలో మనిషికి ప్రాణాలు పోసి బతికిస్తున్నారు వైద్యులు. అందుకే వైద్యులను దేవుడితో పోల్చుతున్నారు. సాధారణంగా మనిషికి గుండె ఎడమ పక్కన ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రపంచంలో చాలా అరుదుగా కొంతమందికి కుడివైపునకు గుండె ఉంటుంది. అంతేకాదు శరీరంలోని అవయవాలు కూడా వ్యతిరేక దిశలో ఉంటాయి. అలాంటి ఇబ్బంది పడుతున్న ఓ యువతి విషయంలో వైద్యలు అద్భుతం చేశారు. వివరాల్లోకి వెళితే..

వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం అనే చెప్పాలి. ఓ యువతికి సాధారణ మనుషుల మాధిరిగా కాకుండా గుండెతో పాటు శరీరంలో ఉండే అవయవాలు వ్యతిరేక దిశలో ఉన్నాయి. ఎడమ పక్క ఉండాల్సిన గుండె కుడి పక్కన ఉంది. దాంతో యువతి కొంతకాలంగా ఇబ్బందులు పడుతుంది. తల్లిండ్రులు వైద్యులకు చూపించగా ఆ యువతి పరిస్థితి తల్లిదండ్రులకు వివరించారు. ఈ క్రమంలోనే ఆ యువతికి గుంటూరు వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి విజయం సాధించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లింగంగుంట్లకు చెందిన మేరీ, ఓంకారయ్య దంపతులకు ఎస్తేరు రాణి అనే కూతురు ఉంది. ప్రస్తుతం ఆ యువతికి పదహరేళ్ల వయసు. గత కొద్ది రోజులుగా ఎస్తేరు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంది.

ఈ క్రమంలోనే ఆమెను శ్రీ ప్రతిమ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె గుండె ఎడమ వైపు కాకుండా.. కుడి వైపు ఉందని, ఆమె శరీర అవయవాలు కూడా వ్యతిరేక దిశలో ఉన్నాయని తెలిపారు. ఆ యువతికి కడుపు నొప్పికి పాంక్రియాస్ లో సమస్య ఉన్నట్లు వైద్యలు తెలిపారు. అవసరమైన చికిత్స చేసి యువతిని ఇంటికి పంపించారు. కొద్ది రోజుల తర్వాత అదే సమస్య రావడంతో ఆపరేషన్ చేయాలని నిశ్చయించారు. వెంటనే ఎండోస్కాపి విధానం ద్వారా లివర్ కు స్టంట్ వేసి బాలికకు ఇబ్బంది లేకుండా వైద్యం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. అంత్యంత ఖరీదైన వైద్యం కేవలం పెద్ద పెద్ద నగరాల్లోనే అందుబాటులో ఉంటుంది.. కానీ తాము మాత్రం ఆరోగ్యశ్రీ కింద బాలికకు అరుదైన వైద్యాన్ని అందించామని అన్నారు. బాలిక పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డివ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల పనీతీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Show comments