French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్‌లో సిగరెట్.. చూస్తే తినలేరిక..

ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్‌లో సిగరెట్.. చూస్తే తినలేరిక..

ఏదైనా ఫుడ్ డెలివరీ వచ్చిందంటే చాలు వెనకా ముందు ఏమీ ఆలోచించకుండా.. గబగబా ప్యాకెట్ తెరిచి, ఫటా ఫట్ తినేస్తుంటారు. అందులో ఈగ వచ్చిందా,దోమ పడిందా, బొద్దింక వచ్చిందా, ఇంకేమైనా చెత్త పడిందా అనేదే చూడరు. ఇటీవల ఓ మహిళ కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఓ వింత వస్తువు దర్శనమిచ్చింది.

ఏదైనా ఫుడ్ డెలివరీ వచ్చిందంటే చాలు వెనకా ముందు ఏమీ ఆలోచించకుండా.. గబగబా ప్యాకెట్ తెరిచి, ఫటా ఫట్ తినేస్తుంటారు. అందులో ఈగ వచ్చిందా,దోమ పడిందా, బొద్దింక వచ్చిందా, ఇంకేమైనా చెత్త పడిందా అనేదే చూడరు. ఇటీవల ఓ మహిళ కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఓ వింత వస్తువు దర్శనమిచ్చింది.

చిన్న పిల్లలు చిరు తిండ్లను బాగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చాక్లెట్స్, బిస్కెట్లతో పాటు బంగాళా దుంపలతో చేసే ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అమితంగా తింటుంటారు. బయటకు వెళ్లితే.. కచ్చితంగా ఇవి కొనిపెట్టాలని అడుగుతూనే ఉంటారు. తినకూడదని చెప్పినా వినిపించుకోకుండా మారాం చేస్తూనే ఉంటారు. ఇంట్లో చేస్తామని చెప్పినా వినరు. అవ్వే కావాలని మంకు పట్టు పడుతుంటారు. లేదంటే ఏడుస్తూనే ఉంటారు. బజార్లో పరువు పోతుందని.. చివరకు చేసేదేమీ లేక తల్లిదండ్రులు ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ వంటివి కొని ఇస్తుంటారు. లేదా పార్సిల్ చేయిస్తుంటారు. అయితే ఓ సారి ఈ వార్త చదవండి.

తల్లిదండ్రులే కాదూ పిల్లలు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ వద్దంటారేమో. అవును మరీ. ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఆర్డర్ పెడితే.. అందులో ఓ వింత వస్తువు కనిపించి.. ఆశ్చర్యంతో పాటు ఆలోచనకు గురి చేసింది. ఇంతకు అందులో ఏముందంటే..?సిగరెట్ పీక.   పిల్లలకు ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్‌ ఆర్డర్ చేసిందో మహిళ. తీరా ప్యాక్ తెరిచి చూస్తే ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అదీ కూడా ప్రముఖ రెస్టారెంట్ నుండి తెచ్చింది. అదే మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని బారో ఇన్ ఫర్నెస్ ప్రాంతంలో జరిగింది. జెమ్మా కిర్క్ బోనర్ అనే మహిళ తన పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఆర్డర్ చేసింది. తన కొడుకుకు వీటిని తినిపిస్తుండగా.. అందులో సగం కాలిపోయిన సిగరెట్ పీక పడి ఉండటాన్ని గమనించింది.

సిగరెట్‌తో పాటు దాని బూడిద కూడా ఉంది. వెంటనే ఆ మహిళ.. ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మెక్ డొనాల్ట్స్ రెస్టారెంట్ నుండి వచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ ను తీసి.. ఏడాది వయస్సున్న కొడుకుకు తినిపిస్తుండగా.. సిగరేట్ పీక చేతికి తగలిందని, అది ఏంటా అని చూసే సరికి.. షాక్ కు గురైనట్టు చెప్పింది. ఫిర్యాదు చేసేందుకు ఆ కంపెనీకి పలుమార్లు ఫోన్లు చేశానని, సరైన స్పందన లేదని చెప్పింది. అయితే ఆమె పోస్టుకు చాలా కామెంట్లు వచ్చాయి. తాము మెక్ డొనాల్ట్స్ రెస్టారెంట్ల నుండి ఎదుర్కొన్న చేదు అనుభవాలను సైతం ఆమెతో పంచుకున్నారు నెటిజన్లు. ఇలాంటి చేదు అనుభవాలు మీకు ఎదురైనట్లయితే.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments