RCB vs RR: ఆ ఒక్క గండం దాటితే.. క్వాలిఫయర్-2 ఆడేది RCBనే!

RCB vs RR: ఆ ఒక్క గండం దాటితే.. క్వాలిఫయర్-2 ఆడేది RCBనే!

రాజస్తాన్ తో మ్యాచ్ లో ఆ ఒక్క గండం దాటితే ఆర్సీబీనే క్వాలిఫయర్-2 ఆడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి బెంగళూరు ముందున్న ఆ గండం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ తో మ్యాచ్ లో ఆ ఒక్క గండం దాటితే ఆర్సీబీనే క్వాలిఫయర్-2 ఆడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి బెంగళూరు ముందున్న ఆ గండం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో మరో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు . అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ తో మ్యాచ్ లో ఆ ఒక్క గండం దాటితే ఆర్సీబీనే క్వాలిఫయర్-2 ఆడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి బెంగళూరు ముందున్న ఆ గండం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు.. ఈ ఐపీఎల్ లో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. టోర్నీ ప్రారంభంలో దారుణ ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆర్సీబీ.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా 6 మ్యాచ్ ల్లో విజయాలు సాధించి.. క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇక ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్తాన్ తో తలపడుతోంది. ఈ క్రమంలో ఆర్ఆర్ తో మ్యాచ్ ఆ ఒక్క గండం దాటితే ఆర్సీబీ ముందుకు వెళ్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆర్సీబీ ముందున్న గండం పేరు ట్రెంట్ బౌల్ట్. అవును ఈ సీజన్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు ఈ కివీస్ పేసర్. 13 మ్యాచ్ ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. అదేంటి తీసింది 12 వికెట్లేగా అని ఈజీగా తీసుకోకండి. ఈ సీజన్ లో పరుగుల వరద పారిస్తున్న కింగ్ విరాట్ కోహ్లీకి ట్రెంట్ బౌల్ట్ ఓ పెద్ద గండం. ఎందుకంటే? బౌల్ట్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడతాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లను ఎదుర్కొవడంలో కోహ్లీ స్ట్రగుల్ అవ్వడం తెలిసిన విషయమే. ఇప్పటి వరకు బౌల్ట్ బౌలింగ్ లో 54 బంతుల్లో 69 పరుగులు మాత్రమే చేసి ఒక్కసారి ఔట్ అయ్యాడు. ఇందులో 26 డాట్ బాల్స్ ఉండటం గమనార్హం.

ప్రారంభం ఓవర్లలో కొత్త బాల్ తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో సిద్ధహస్తుడు ట్రెంట్ బౌల్ట్. అందుకే అతడి ఓవర్లో నెమ్మదిగా ఆడి.. ఆ తర్వాత వేరే వారి బౌలింగ్ లో హిట్టింగ్ చేయాలి. అలా కాకుండా బౌల్ట్ బౌలింగ్ లో దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ ఒక్క గండం దాటితే ఆర్సీబీ  క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే.. రాజస్తాన్ రాయల్స్ టీమ్ లో జోస్ బట్లర్ లేకపోవడం ఆ టీమ్ కు పెద్ద సమస్యగా మారింది. దాంతో ఆర్ఆర్ బ్యాటింగ్ కాస్త వీక్ గా కనిపిస్తోంది. ఆర్సీబీ బౌలింగ్ కూడా బలంగా మారింది. దీంతో బౌల్ట్ ఒక్కడిని దాటితే ఆర్సీబీ గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments