చామంతి పూల టీతో అద్భుత ప్రయోజనాలు.. అవి ఏంటో తెలుసుకోండి
సాధారణంగా చామంతి పూలను పూజల కోసం వినియోగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.
కానీ, ఈ చామంతి పూలను దశాబ్దాల క్రితం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.
ముఖ్యంగా ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చామంతి టీ వలన నిద్రలేమి సమస్యలకు తగ్గించడంతో పాటు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ చామంతి టీ ఎంతగానో సహాయపడుుతంది.
ముఖ్యంగా ఈ చామంతి టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. కనుక ఇవి వాపు లక్షణాలు,కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
అంతేకాకుండా.. ఈ చామంతి టీ జలుబు లక్షణాలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెపుతున్నాయి.
దీంతో పాటు ఈ చామంతి టీ కొరోనరీ హార్ట్ డిసీజ్ వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పైగా గుండెకు కూడా ఈ చామంతి టీ ఎంతగానో సహాయపడుతుంది.
ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చామంతి టీ తాగడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.
అలాగే బరువు తగ్గాలనుకొనేవారికి సైతం చామంతి టీ మంచి ప్రత్యామ్నాయం.
అయితే గర్భం దాల్చిన మహిళలు, పాలిచ్చే తల్లులు, రక్తం గడ్డకుండా మాత్రలు ఉపయోగించేవారు చామంతి టీ తాగాలనుకొంటే ముందు వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి.
గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం