Off-white Banner
స్మోక్ బిస్కెట్‌లు తింటున్నారా? ప్రాణాలు పోతాయి జాగ్రత్త
చాలా మంది పిల్లలు టీ తో పాటు బిస్కెట్లను తినడానికి ఇష్టపడుతుంటారు.
అయితే ఈ మధ్యాకాలంలో సాధారణ బిస్కెట్లకు భిన్నంగా స్మోక్ బిస్కెట్లు మార్కెట్ లోకి వచ్చాయి.
స్మోక్ బిస్కెట్ నోట్లో వేసుకోగానే నోరు, ముక్కు నుంచి వచ్చే పొగలు యువతకు వింతైన అనుభూతిని కలిగిస్తున్నాయి.
సరదా కోసం స్మోక్ బిస్కెట్లను పిల్లలు, పెద్దలు అందరూ తింటున్నారు.
స్మోక్ బిస్కెట్లతో అనేక ఆరోగ్య
పరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.
లిక్విడ్ నైట్రోజన్ బిస్కెట్స్ మీద వేయడం ద్వారా ఈ పొగ వస్తుంది. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్టులలో, ఫంక్షన్ హాల్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
స్మోక్ బిస్కెట్లను తింటున్నప్పుడు అందులోంచి విపరీతమైన పొగ వస్తుంది.
స్మోక్ బిస్కెట్లు తినేటపుడు వచ్చే పొగ సిగరెట్ తాగితే వచ్చే పొగకంటే డేంజర్ అంటున్నారు నిపుణులు.
ఈ పొగ వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
చిన్న పిల్లల్లో ఊపిరితిత్తుల సమస్యలకు కారణం అవుతాయని వైద్యులు అంటున్నారు.
ఈ స్మోకింగ్ బిస్కెట్స్ తినడం వల్ల నోటి లోపల సెన్సిటివిటీ కోల్పోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం