బ్రోకలీ చూడడానికి కాలీఫ్లవర్లా ఉంటుంది.. కానీ ఇది బంగారంతో సమానం.
శరీరంలో అవసరం అయ్యే ఎన్నో పోషకాలు బ్రోకలీలో పుష్కలంగా లభిస్తాయి.
తరుచుగా ఈ కూరగాయను తింటే.. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
అంతేకాకుండా బ్రోకలీ తింటే ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు.
బ్రోకలీలో విటమిన్ సి, కె, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెండ్లు ఉంటాయి.
పైగా దీనిని తీసుకోవడం వలన జీర్ణ శక్తి మెరుగు పడుతుంది.
బ్రోకలీలో ఇండోల్ 3 కార్బినోల్, సల్ఫోరాఫేన్ వంటి ఫైటో కెమికల్స్ ఉంటాయి.
ఇది క్యాన్సర్ నివారించడం మాత్రమే కాకుండా క్యాన్సర్ రాకండా కూడా అడ్డుకుంటుంది.
కాబట్టి కనీసం అప్పుడప్పుడైనా బ్రోకలీ తీసుకోవడం మంచిది.
గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం