మరణించిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి!

మరణించిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి!

సాధారణంగా చనిపోయిన వారు తిరిగి బతకడం అనేది జరగదు. అయితే తాజాగా ఓ చిన్నారి విషయంలో అద్భుతం జరిగింది. మరణించిన 12 గంటల తరువాత ఆ చిన్నారి తిరిగి బతికింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

సాధారణంగా చనిపోయిన వారు తిరిగి బతకడం అనేది జరగదు. అయితే తాజాగా ఓ చిన్నారి విషయంలో అద్భుతం జరిగింది. మరణించిన 12 గంటల తరువాత ఆ చిన్నారి తిరిగి బతికింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

సమాజంలో ప్రతి ఒక్కరు దేవుడి తరువాత ఆ స్థాయిలో కొలిచేది వైద్యులనే. కారణంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే.. దేవుడిని వేడుకోవడంతో పాటు డాక్టర్లను సంప్రదిస్తాం. తమ వారి ప్రాణాలు కాపాడాలనే వేడుకుంటాము. అలానే వారు కూడా వైద్యం అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటారు. అందుకే డాక్టర్లను దేవునితో సమానమని అంటారు. అయితే వాళ్లు కూడా మనుషులే కాబట్టి ఒక్కోసారి పొరపాటులు చేస్తుంటారు. ఓ చిన్నారి విషయంలో కూడా వైద్యులు అలాంటి పొరపాటే చేశారు. దీంతో మరణించిన ఆ చిన్నారి.. 12 గంటల తరువాత తిరిగి బతికింది. స్థానికులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది. మరి.. ఎక్కడ జరిగింది? అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసకుందా..

మెక్సికో లోని శాన్ లూయిస్ పొటోసి ప్రాంతంతలో కైమోలియా రోక్సానా అనే మూడేళ్ల చిన్నారి కుటుంబంతో కలసి నివాసం ఉంటుంది. ఆ బాలిక కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు శాన్ లూయిస్ పొటోసి ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స  చేసిన అనంతరం ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్థారించాడు. ఇది జరిగిన దాదాపు 12 గంటల తరువాత ఒక అద్భుతం జరిగింది. వైద్యులు ఆ చిన్నారి మరణించినదని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సన్నాహాలు మొదలుపెట్టారు.

కైమెలియా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, ఆమె తల్లికి తన కుమార్తె  బతికేవుందని అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆమె శవపేటి దగ్గరు చేరుకుంది. చిన్నారి ఉన్న శవపెటికను తెరవమని అక్కడున్నవారిని కోరింది. అయితే ఒక్కసారి మూసిన తరువాత తిరిగి తెరిచేందుకు అక్కడి వారు అంగీకరించలేదు. అంతేకాక అంత్యక్రియలను కొనసాగించారు. ఇదే సమయంలో కొంతసమయం తరువాత శవపేటికలో నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో వెంటనే ఆ శవపెటికను తెరిచి, ఆ పాపను బయటకు తీశారు. దీంతో ఆ చిన్నారికి మరుజన్మ లభించిందని పలువురు పేర్కొన్నారు.

 కొంతకాలం క్రితం జరిగిన ఈ ఘటన… తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. మన దేశంలో సైతం ఇలాంటి విచిత్ర ఘటనలు జరిగాయి. స్మశానానికి తీసుకెళ్తే.. అక్కడ హఠాత్తుగా లేవడం. చనిపోయాడనుకున్న వ్యక్తిని పూడ్చి పెట్టే సమయంలో చేతులు, కాళ్లు కదిలించడం వంటి ఘటనలు చాలానే జరిగియి. కానీ ఇలా చనిపోయిందనుకున్న  చిన్నారి దాదాపు 12 గంటల తరువాత తిరిగి బతికింది. మరి.. ఈ వింత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments