Rinkoo Singh Rahee: 100 కోట్ల స్కాం బయటపెట్టిన అధికారి.. పిచ్చోడంటూ సస్పెండ్! 15 ఏళ్ల తర్వాత..

100 కోట్ల స్కాం బయటపెట్టిన అధికారి.. పిచ్చోడంటూ సస్పెండ్! 15 ఏళ్ల తర్వాత..

Rinkoo Singh Rahee: ఓ అధికారి నిజాయితీకి బహుమానంగా ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగులు. చావు అంచాలదాక వెళ్లి వచ్చాడు. కానీ ఆయన ఎక్కడైతే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందో అక్కడకే బలంగా నిలబడ్డి రియల్ హీరో అనిపించుకున్నాడు.

Rinkoo Singh Rahee: ఓ అధికారి నిజాయితీకి బహుమానంగా ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగులు. చావు అంచాలదాక వెళ్లి వచ్చాడు. కానీ ఆయన ఎక్కడైతే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందో అక్కడకే బలంగా నిలబడ్డి రియల్ హీరో అనిపించుకున్నాడు.

నేటికాలంలో అవినీతి, అక్రమాలకు పాల్పడేవారు బాగా పెరిగిపోయారు. రాజకీయనేతలు, కొందరు ప్రభుత్వ అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. అయితే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం నిజాయితీగా పని చేస్తూ అవినీతి పరుల ఆటలను కట్టిపడేస్తున్నారు. అలాంటి నిజాయితిపరులైన అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలానే ఓ అధికారి 100 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టాడు. ఫలితంగా ఆయనకు పిచ్చొడని ముద్రవేసి సస్పెండ్ చేశారు. కట్ చేస్తే.. 15 ఏళ్ల తరువాత తనను అవమానించిన వారికే షాకిచ్చాడు. ఇంతకీ ఆ అధికారి ఎవరు, ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌కి చెందిన  రింకు సింగ్ రాహీ రాష్ట్ర స్థాయి పీసీఎస్‌ ఎగ్జామ్ 2007 క్యాలిఫైడ్ అయ్యాడు. దీంతో ఆ రాష్ట్ర సంక్షేమ శాఖలో అధికారిగా ఉద్యోగం సాధించాడు. ఇక నిజాయితీగా విధులు నిర్వహిస్తూ.. అవినీతి పరుల భరతం పట్టాడు. అలా ఉద్యోగం నిర్వహిస్తున్న సమయంలో సంక్షేమ శాఖకు సంబంధించిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు రింకు సింగ్ గుర్తించారు. ఆయన చేసిన దర్యాప్తులో సంక్షేమ శాఖ నుంచి భారీ మొత్తంలో నిధులు పక్కదారిపట్టినట్లు గుర్తించాడు. దీంతో ఎలా జరిగిందనే మరింత క్షణ్ణంగా దర్యాప్తు చేయగా ఏకంగా రూ. 100 కోట్ల స్కాలర్‌షిప్‌ కుంభకోణం బయటపడింది. దీంతో ఈ స్కామ్ కి పాల్పడ ఎనిమిది మందిపై  కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు.

నిందితుల్లో నలుగురికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో వారందరూ రింకూ  సింగ్ రాహీపై కక్ష పెంచుకున్నారు. అదను చూసి ఏకంగా అతడిపై తుపాకీతో కాల్పులు జరిపారు.  మొత్తం ఏడు రౌండ్లు కాల్పులు జరపగా రాహి తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో రింకూ  కుడివైపు కన్ను, దవడ పూర్తిగా దెబ్బతిన్నాయి. వినికిడిడితో పాటు ఒక కంటికి చూపును  కోల్పోయాడు. ఇంకా చెప్పాలంటే.. అందవిహీనంగా మారడంతో పాటు సర్వం కోల్పోయాడు. ఈ దాడి కారణంగా రాహీ నాలుగు నెలలు ఆస్పత్రిలో ఉన్నాడు. ఆ సమయంలో అధికారులు సైతం ఆయనపై కక్ష కట్టి.. కనీసం మెడికల్ లీవ్ లు కూడా ఇవ్వలేదు.

ఇది అంతా ఇలా ఉంటే.. ఆయన నిజాయితీగా పని చేసి.. కోట్ల స్కామ్ ను వెలికి తీస్తే.. అది గుర్తించకపోగా.. పిచ్చొడని ముద్రవేసి.. ఏకంగా సస్పెండ్ చేశారు. ఆయన నిజాయితి ప్రతిఫలంగా మెంటల్ వాడు అనే ట్యాగ్ తగిలించారు. దీంతో రింకూ సింగ్ వెలికి తీసిన ఆధారాలు మొత్తం చెల్లకుండాపోయాయి. ఇలా చుట్టుపక్కల శత్రువులు, పరిస్థితులు కారణంగా ఆయన శారీరకం, మానసికంగా, నిరాశలోకి వెళ్లారు. తాను ఒక చిన్న అధికారిగా ఉంటే అలాంటి కుంభకోణాలును అడ్డుకట్టవేయలేనని భావించి.. ఐఏఎస్ కావాలని భావించాడు.ఇలాంటి స్కామ్‌లకు అడ్డుకట్టవేయలేనని భావించి..ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలని అనుకుంటాడు. విధికి ఎదురీదైనా అనుకున్న లక్ష్యం సాధించాలని నిశ్చయించకున్నాడు.

ఈ క్రమంలో సరిగ్గా 40 ఏళ్ల వయస్సులో యూపీఎస్సీ పరీక్షలు రాసేందుకు ప్రిపేర్ అయ్యాడు. తన చివరి ప్రయత్నంలో 2021లో ఉత్తీర్ణ సాధించి 683వ ర్యాంకు సాధించారు. వికలాంగుల కోటలో సివిల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఎక్కడైతే పిచ్చోడని ముద్ర వేయించుకుని సస్పెండ్‌ అయ్యాడో అదే ప్రాంతానికి 15 ఏళ్ల తర్వాత ఐఏఎస్‌ ఆఫీసర్‌గా వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాకు కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో అక్కడి అధికారులు, ఆయనను ఇబ్బంది పెట్టిన వారు భయంతో వణికిపోయారు.  ఇక తన విజయం గురించి రింకూ సింగ్ రాహీ మాట్లాడుతూ.. తనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పారు.

తాను ఎప్పుడైనా ప్రజా ప్రయోజనాలను ఎంచుకుంటానని నిర్భయంగా పని చేస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయనకి 44 ఏళ్ల వయస్సు కాగా, తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇంక రింకు సింగ్ స్టోరీ తెలిసిన వారు ఆయన నిజంగా రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాంటి దారుణమైన పరిస్థితులు ఎదర్కొన్న..ఇకెవ్వరైనా చాలా అవమానంగా భావించి కుంగిపోతారు. ఆయన మాత్రం విధికే ప్రతి సవాలు విసిరి..పడిలేచిన కెరటంలా నిలబడి తానేంటో చూపించాడు. ఆయన కథ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది. అంతేకాక ఎంతో మంది ప్రభుత్వ అధికారులకు ఆయన ఆదర్శం. మరి.. ఈ రియల్ హీరోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments