iDreamPost

టిడిపి హయాంలోనే రంగనాయకమ్మపై 15 కేసులా ?

టిడిపి హయాంలోనే రంగనాయకమ్మపై 15 కేసులా ?

గుంటూరు జిల్లాకు చెందిన రంగనాయకమ్మ కేంద్రంగా ఈమధ్య తెలుగుదేశంపార్టీ నేతలు ఎన్ని రాజకీయాలు చేశారో అందరికీ తెలిసిందే. వైజాగ్ లోని ఆర్ ఆర్ వెంకటాపురం లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ప్రమాదంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను రంగనాయకమ్మ ప్రమోట్ చేసినందుకు ఆమెపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. ఈ విషయం ఎప్పుడైతే విషయం వెలుగు చూసిందో చంద్రబాబునాయుడు, నారా లోకేష్ తో పాటు ఎల్లోమీడియా కూడా రంగనాయకమ్మకు మద్దతుగా రంగంలోకి దిగేశారు. తండ్రి, కొడుకులు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై నానా రచ్చ చేశారు. ’66 ఏళ్ళ వృద్ధురాలిపై అక్రమంగా కేసులు పెడతారా ? జగన్ ప్రభుత్వానికి మానవత్వం లేదా’ అంటూ చాలా కతలు చెప్పారు.

సీన్ కట్ చేస్తే తాజాగా బయటపడిందేమంటే అసలు ఆమెపై టిడిపి హయాంలోనే 15 కేసులు నమోదయ్యాయని. ఆమె మీద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 13 క్రిమినల్ కేసులు, రెండు సివిల్ కేసులు నమోదైంది. సివిల్ కేసులు ఎందుకు నమోదవుతాయి ? ఎవరితో అయినా గట్టు తగాదాలు వస్తేనే కదా ? పొలం కావచ్చు, ఇంటి స్ధలం కూడా కావచ్చు. బహుశా ఈమె తెలుగుదేశం పార్టీని అడ్డుపెట్టుకుని ఇతరుల పొలమో స్ధలమో ఆక్రమించుకుని ఉండవచ్చు. అందుకనే రెండు సివిల్ కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన ఈమె హార్డ్ కోర్ టిడిపి అభిమాని అన్న విషయం బయటపడింది.

ప్రత్యక్షంగా ఈమె సివిల్, క్రిమినల్ వివాదాల్లో తలదూర్చిందో లేకపోతే ఈమెను అడ్డుపెట్టుకుని వెనక నుండి ఎవరైనా కథలు నడిపించారో తెలియాల్సుంది. ప్రత్యక్షంగా ఈమె సీన్ లో ఉంది కాబట్టి ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. 13 క్రిమినల్ కేసులు కూడా ఈమెపై నమోదయ్యాయంటే ఏమిటర్ధం ? ఈమెపై నమోదైన కేసుల వివరాలన్నీ ఒక్కోటిగా బయటపడతున్నాయి. ఇప్పటికి బయటపడింది 15 కేసులే. మరి కొద్ది రోజుల్లో కేసుల హిస్టరీ మొత్తం బయటకు వస్తుందనటంలో సందేహం లేదు.

ఇక్కడ విచిత్రమేమంటే తమ హయాంలోనే ఈమెపై 15 కేసులు పెట్టిన చంద్రబాబు ఇపుడు రంగనాయకమ్మను వెనకేసుకొస్తుండటం. ఇంత హార్డ్ కోర్ టిడిపి అభిమాని అయినా ఈమెపై టిడిపి హయాంలోనే 15 కేసులు నమోదయ్యాయంటే ఏ స్ధాయిలో వ్యవహారాలు నడిపిందో అర్ధమైపోతోంది. బహుశా ప్రత్యర్ధులు కూడా పార్టీలోనే గట్టి వాళ్ళవ్వబట్టే ఈమెపై అన్ని కేసులు నమోదయ్యాయేమో అప్పట్లోనే. లేకపోతే టిడిపి అభిమానులపై టిడిపి హయాంలో ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా ? కాబట్టి రంగనాయకమ్మ వృద్ధురాలంటూ చంద్రబాబు, చినబాబు ఆడుతున్నవి డ్రామాలని అందరికీ అర్ధమైపోయింది. అందుకనే వాళ్ళ డ్రామాలకు జనాల నుండి మద్దతు రాలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి