1 BHK Flat@70K: 1 BHK ఇంటి అద్దె రూ. 70 వేలా! ఒక ఇంటికి కట్టే EMIరా అది..

1 BHK ఇంటి అద్దె రూ. 70 వేలా! ఒక ఇంటికి కట్టే EMIరా అది..

1 BHK Flat@70K: 1 బీహెచ్కే ఇంటి అద్దె 70 వేలా? అది ఒక రెండు నెలల ఇంటి ఈఎంఐరా. అరేయ్ ఏంట్రా ఇది? మరీ ఇంతంత అద్దెలా? ఇలా అయితే మనుషులు ఎలా బతకాలి? దేశంలోనే టాప్ సిటీస్ లో ఒకటైన మహా నగరంలో ఇదీ పరిస్థితి. అద్దె కట్టలేక జనాలు పారిపోయే పరిస్థితి.

1 BHK Flat@70K: 1 బీహెచ్కే ఇంటి అద్దె 70 వేలా? అది ఒక రెండు నెలల ఇంటి ఈఎంఐరా. అరేయ్ ఏంట్రా ఇది? మరీ ఇంతంత అద్దెలా? ఇలా అయితే మనుషులు ఎలా బతకాలి? దేశంలోనే టాప్ సిటీస్ లో ఒకటైన మహా నగరంలో ఇదీ పరిస్థితి. అద్దె కట్టలేక జనాలు పారిపోయే పరిస్థితి.

రెంట్ ఇది చిరు ఉద్యోగులకి ఒక బూతు పదం లాంటిది. వచ్చే జీతానికి, కట్టే రెంట్ కి అస్సలు సంబంధం ఉండదు. ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక హైదరాబాద్ లాంటి నగరాలకు వలసలు వెళ్తే.. అక్కడ రెంట్లు చెల్లించలేక నరకం అనుభవిస్తున్నారు. వచ్చే జీతంలో సగం రెంట్ కి, మిగతా దాంట్లో కరెంట్ కి, ఇంటర్నెట్ కి, ఇతర ఖర్చులకు, తిండికి, తిప్పలకి పోతుంటే మిగిలేది దరిద్రం తప్ప ఇంకేం ఉండడం లేదని సగటు ఉద్యోగి ఇవాళ బాధపడే పరిస్థితి. ఇంటి రెంట్ 10 వేలు దాటి ఉంటేనే ఆమ్మో అంత రెంటా అనే పరిస్థితి. ఇక 15 వేలు, 20 వేలు, 30 వేల ఇంట్లో అద్దెకుంటున్న వారికి దండం పెట్టాలని అంటారు. అయితే ఇంటి రెంట్ అంటే ఒక 8 వేలో, 10 వేలో ఉండాలి. 2 బీహెచ్కే అయితే 15 వేలు, 20 వేలు ఉండాలి. అంతేగానీ మరీ 50 వేలు, 70 వేలు ఏంటి బ్రో.

అది రెంటా? లేక ఈఎంఐనా? అసలు 70 వేలు ఇంటి అద్దె కట్టడం ఏంటి బ్రో. తీసుకునేవాడికి లేదంటే ఓకే కానీ ఇచ్చేవాడికైనా ఉండాలి కదా బుద్ధి అని అనాలనిపిస్తుంది కదూ. కానీ తప్పు పాఫం రెంట్ తీసుకునేవారిది కాదు.. అంత పెద్ద మొత్తంలో రెంట్ చెల్లించేవారిది కాదు. ఆ ఏరియాలో ఉన్న డిమాండ్ అటువంటిది. ఈ డిమాండ్ ని కమాండ్ చేయలేక చాలా మంది ఆ ఏరియాలోనే కాదు.. ఆ సిటీలోనే ఉండడానికి ఒప్పుకోవడం లేదు. మేము ఈ మహా నగరంలో ససేమిరా ఉండమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ మహా నగరం మరేదో కాదు ముంబై. ఇక్కడ కొందరి జీవితాలు తప్ప మిగతావన్నీ ఖరీదైనవిగానే ఉంటాయి.

పెరుగుతున్న ధరలకు తగ్గట్టు ఇక్కడ అద్దెకు ఇళ్ళు దొరకడం అనేది గగనం. ఇటీవల విటా అనే ఒక న్యాయవాది తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ముంబైలో ప్రధాన ఏరియాల్లో 1 బీహెచ్కే ఫ్లాట్ అద్దె నెలకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకూ ఉంటుందని ట్వీట్ లో పేర్కొన్నారు. సింగిల్ గా ఉండడం కోసం బయట అద్దెకు ఉండాలనుకునేవారు ఒకసారి ఆలోచించుకోవాలని.. కుటుంబ సభ్యులతో కలిసి నివసించడం ఉత్తమం అని ట్వీట్ లో పేర్కొన్నారు. స్వతంత్రంగా ఉండడం కోసం ఇంట్లోంచి బయటకు రావాల్సిన అవసరం లేదని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. దీంతో చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

ముంబైలో ఖరీదైన జీవన వ్యయం గురించి నెటిజన్స్ తమ సొంత అనుభవాలను షేర్ చేస్తున్నారు. అప్పులు లేకుండా ఇల్లు, నాణ్యమైన విద్య, మంచి వైద్యం పొందడం అనేది అసాధ్యం అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఇంటి అద్దె 70 వేలా? అది అద్దెనా? లేక ఈఎంఐనా? అని మరొక నెటిజన్ కామెంట్స్ చేశారు. నేను పోతానన్నయ్యా నే పోతా.. చూశాను ఈ జీవితానికి ఇది చాలు. ఈ అద్దెను నేను భరించలేను అంటూ మరొక నెటిజన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ముంబైలో అంతే ముంబైలో అంతే.

Show comments